|
|
![]() |
ఇప్పుడు టెక్నాలజి లో ఎక్కువుగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(ఏఐ) .ఈ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ని మనం చాల చోట్ల ఉపయోగిస్తున్నాము . అసలు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అంటే ఏమిటి మరియు దాని వలన మానవుని జీవితం లో ఏఏ మార్పులు రాబోతున్నాయి అనేది ఈ బ్లాగ్ లో తెలుసుకుందాము.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్
అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్ . మానవునికి వున్న అతి గొప్ప శక్తి అలోచించి నిర్ణయాలు
తీసుకోవడం. అందుకు కారణం మన మెదడు. అందుకే మన ఆలోచనలకు ఊహాశక్తి కి హద్దులే ఉండవు. అదే మెదడు ఒక
యంత్రానికి ఉంటె ఏం
జరుగుతుంతో
ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా అయితే సొంతం గా అలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతామో ఒక machine కూడా అలాగే సొంతం గా
అలోచించి చుట్టూఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసికోగలిగితే దాన్నే
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అంటారు.
మనం బయట ప్రప్రపంచాన్ని చూసి
నేర్చుకున్నట్లు అదే తరహాలో నేర్చుకొని ఆలోచించగలిగే కంప్యూటర్
ప్రోగ్రామ్.సాధారణంగా ఇప్పటివరకు ఒక కంప్యూటర్ కు ఒక ప్రోగ్రామ్ ఇస్తే దానికి
ఎగ్జిక్సుట్ చేయడం మాత్రమే తెలుసు.కానీ AI అలాకాదు. ఒక పనిని మళ్ళీ
మళ్ళీ చేస్తున్నప్పుడు దానిని ఇంకా ఎలా బెటర్ గా చేయచ్చో ఆలోచిస్తుంది.
అందులో తప్పులు ఉంటే తనకు తానే సరిదిద్దుకుంటుంది.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ని మన డైలీ లైఫ్ లో
చాల చోట్ల ఉపయోగిస్తున్నాము. ఉదాహరణకు మనం మొబైల్ లో ఏదయినా టైప్ చేసేటప్పుడు ఆ వర్డ్ ని ముందుగానే సజెస్ట్ చేస్తుంది.యూట్యూబ్ లో
ఏదయినా టాపిక్ గురించిగాని వస్తువు గురించిగాని మనం రిపీటెడ్ గా వెతికే చేసేటప్పుడు దానికి
సంబంధించిన వీడియోస్ నే సజెస్ట్ చేస్తుంది. అంతేగాకుండా వాటికీ సంబంధించిన ప్రకటనలు మాత్రమే వచ్చేటట్లు చేస్తుంది. ఇదంతా ఏఐ వల్లనే సాధ్యమవుతుంది.
అంటే గూగుల్ లో ఇన్నర్ గా ఏఐ ప్రోగ్రామ్స్ ఉపయోగించడం వల్లే యిదంతా
జరుగుతుంది.
మన మెదడు లాగానే ఏఐ కూడా పనిచేస్తుంది. మన
మెదడు లో ఒక్కొక్క న్యూరాన్ కొన్ని వందల న్యూరాన్ ల తో కనెక్ట్ అయివుంటుంది. అలాగే ఏఐ కూడా న్యూరల్ నెట్వర్క్ పద్దతి
లో నే ప్రపంచం లో అన్ని నెటవర్క్స్ తో కనెక్ట్ అయిఉంటుంది.
మనం చుట్టు పక్కల విషయాలను గమనిస్తూ ఎలా నేర్చుకుంటామో ఏఐ కూడా అంతే.దానికి
అందించిన సమాచారాన్ని బట్టి కొత్త విషయాలను నేర్చుకుంటుంది,అంతేకాదు దానికదే
ప్రోగ్రామింగ్
ని
మార్చుకుంటుంది.ఇలా మనిషి సహాయం లేకుండానే ఏఐ తన మేథస్సు ని
పెంచుకుంటుంది.
ఒకవేళ పూర్తి స్థాయిలో ఏఐ వస్తే ఈ భూమి మీద అత్యంత
శక్తివంతమైనది అదే అవుతుంది. మనుషులకు బయోలాజికల్ గా
కొన్ని పరిమితులు ఉన్నాయి.వాటిని దాటి వెళ్ళలేరు.కానీ ఏఐ కి అలాంటి లిమిట్స్ ఏమీ లేవు.కాబ్బట్టి నిరంతరం
నేర్చుకుంటూ ఉండే ఏఐ తో
మనుషులు పోటీ పడలేరు అని స్టీఫెన్ హాకింగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఏఐ దానికదే తన ఇంటలిజెన్స్
ని పెంచుకుంటూ ఒకానొక సమయం లో సింగులారిటీ అనే స్థాయి కి చేరుకుంటుంది,ఆ సమయం లో ఒక చీమ ఒక
మనిషిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో మనిషి ఏఐ ని కంట్రోల్ర్ చేయడం అంతే
కష్టం అవుతుంది.ఎందుకంటే మన కంటే తెలివైన దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం.మన
కంట్రోల్ చేయగలిగినంత వరకు ఈ ఏఐ ని ఎంత డెవలప్ చేసినా అది
మనకు మంచే చేస్తుంది.కానీ కంట్రోల్ తప్పితే రెర్మినేటర్ , సినిమా లోనే ఫిక్షన్
నిజమవుతుందని కొంతమంది చెబుతున్నారు.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి ఏఐ వలన అంతా మంచే
జరుగుతూవుంది .ఒకవేళ ఇది అడ్వాన్స్
అయితే ఇది మంచికి ఉ యోగపడుతుందా లేదా
ఎదురుతిరుగుతుందా అని ఎవ్వరు చెప్పలేరు.
ఇదండీ ఏఐ గురించి. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్స్ లో తెలియచేయండి.

No comments:
Post a Comment